Back to FeedQuickToday Shorts

National
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
CEC జ్ఞానేష్ కుమార్ తక్షణమే తప్పుకోవాలి.. 'SIR'పై విచారణకు సీఎం స్టాలిన్ డిమాండ్!
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై DMK అధినేత ఎం.కే.
స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
'SIR' ప్రక్రియ పేరిట కోట్లాది ఓటర్ల పేర్లను తొలగించడాన్ని DMKతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు.
మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల అభ్యంతరాలను లెక్కచేయకుండా CEC ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వార్తా కథనం ద్వారా బయటపడిందని, దీంతో ఎన్నికల నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న ఆయనకు పదవిలో కొనసాగే హక్కు లేదని, వెంటనే 'SIR'ను నిలిపివేసి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.



