Back to FeedQuickToday Shorts

National
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నెస్లే ఇండియాకు FSSAI షాక్: బేబీ ప్రొడక్ట్స్‌లో నిబంధనల ఉల్లంఘన
ప్రముఖ సంస్థ నెస్లే ఇండియాపై కఠిన చర్యలు తీసుకునేందుకు FSSAI సిద్ధమైంది. ఆ సంస్థ తయారుచేసే పసిపిల్లల ఆహార ఉత్పత్తులైన 'NAN Excella Pro Stage 1', 'Lactogen Pro 1' కు సంబంధించి నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఉత్పత్తులలోని వే ప్రొటీన్ (Whey Protein) పిల్లలకు సులువుగా అరుగుతుందని సంస్థ ప్రమోట్ చేసుకుంటున్న విధానంపై FSSAI వివరణ కోరింది.
అంతేకాకుండా, నిర్వహించిన పరీక్షల్లో ఈ ఉత్పత్తుల్లో బయోటిన్ శాతం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేవలం లాభాల కోసం శిశువుల పాల ఉత్పత్తులను ఈ విధంగా ప్రమోట్ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
Tags:#National#National#Shorts





