Back to FeedQuickToday Shorts

National
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రాహుల్ కు రాజకీయ పరిజ్ఞానం లేదు: బీజేపీ ఫైర్
భారత రాజకీయాలపై రాహుల్ గాంధీకి అవగాహన లేదని బీజేపీ విమర్శించింది.
పార్టీ ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ, 1967 నుండి తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, అప్పటికి బీజేపీ పుట్టనే లేదని ఎద్దేవా చేశారు.బెంగాల్ (1977), యూపీ (1989), బీహార్ (1990), ఒడిశా (1999) వంటి రాష్ట్రాల్లో దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైందని గుర్తుచేశారు.
పారదర్శకమైన ఎన్నికలు, సీసీటీవీల వినియోగం, స్వతంత్ర మీడియా వంటి వ్యవస్థలు బలపడటంతోనే కాంగ్రెస్ గెలవలేకపోతోందని ఆయన సెటైర్ వేశారు.
సాంకేతికత పెరిగిన తర్వాత కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆయన పరోక్షంగా విమర్శించారు.



