Back to FeedQuickToday Shorts

National
Sep 6, 2026Short Read
ఉగ్రవాదంలాగే డ్రగ్స్పైనా ఉక్కుపాదం: అమిత్ షా
నక్సలిజం, ఉగ్రవాదాలను ఏరిపారేసినట్లుగానే మాదకద్రవ్యాలపై సైతం కఠిన పోరాటం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
2029 నాటికి దేశాన్ని 'డ్రగ్స్ ఫ్రీ ఇండియా'గా మార్చేందుకు పటిష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు.
మాదకద్రవ్య రహిత యువతే 'వికసిత్ భారత్-2047' లక్ష్యానికి మార్గదర్శకులవుతారని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు.
డ్రగ్స్ సరఫరాను, వాటి ఆర్థిక మూలాలను పూర్తిగా నిర్మూలించే ఈ బృహత్తర కార్యంలో అన్ని రాష్ట్రాలను భాగస్వాములను చేస్తామని అమిత్ షా వెల్లడించారు.





