Back to FeedQuickToday Shorts

National
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ప్రధాని మోదీపై ప్రజా వ్యతిరేకత ఎందుకు రాదు?: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విషయంలో యాంటీ ఇన్‌కంబెన్సీ (ప్రజా వ్యతిరేకత) ఎందుకు రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వాలకు ప్రజా వ్యతిరేకత తప్పదని, పాకిస్తాన్‌పై యుద్ధం గెలిచాక ఇందిరా గాంధీకి ఎంతో ప్రజాదరణ వచ్చినప్పటికీ, 1-2 ఏళ్లకే వ్యతిరేకత మొదలైందని ఆయన గుర్తుచేశారు.
అలాంటప్పుడు మోదీ, అమిత్ షా, బీజేపీలకు మాత్రం వ్యతిరేకత ఎందుకు రాదని నిలదీశారు. 50 ఏళ్లు అధికారంలో ఉంటామని వారు చెప్పడానికి ‘ఓట్ చోరీ’ (ఓట్ల దొంగతనమే) అసలు కారణమని రాహుల్ విమర్శించారు.
Tags:#National#National#Shorts





