Back to FeedQuickToday Shorts

National
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వంట నూనెలపై దిగుమతి సుంకాల కోత.. దిగిరానున్న నూనె ధరలు!
వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ముడి, రిఫైండ్ వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (BCD) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ముడి సోయాబీన్, పామ్ ఆయిల్స్‌పై BCDని 10% నుండి 5%కి, రిఫైండ్ సోయాబీన్, పామ్ ఆయిల్స్‌పై 32.7% నుంచి 27.5%కి తగ్గించింది.మరోవైపు ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఉన్న 10% సుంకాన్ని పూర్తిగా రద్దు చేయగా, రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకాన్ని 32.5% నుండి 22.5%కి కుదించింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలోనే మార్కెట్లో వంట నూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.



