Back to FeedQuickToday Shorts

National
Aug 3, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఇన్స్టాలోనే జీవితాన్ని గడిపేస్తున్న భారతీయులు..!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 3 :- భారతీయులు సోషల్ మీడియా యాప్‌లలో ఎక్కువగా వాడేది ఇన్స్టాగ్రామ్ అని BofA గ్లోబల్ రీసెర్చ్ నివేదికలో వెల్లడైంది.
ఒక్కో యూజర్ సగటున నెలకు దాదాపు 50 గంటలు ఇందులోనే గడుపుతున్నట్లు తెలిసింది.
అంటే, నెలకు రెండు రోజులకు పైగానే ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోతున్నారన్నమాట.వాడుకలో ఇన్స్టాగ్రామ్ 49 గంటల 42 నిమిషాలతో టాప్‌లో ఉంది.
ఆ తర్వాతి స్థానాల్లో యూట్యూబ్ (47 గంటల 23 నిమిషాలు), అలాగే మొబైల్ గేమ్ ‘గరీనా ఫ్రీ ఫైర్’ (41 గంటల 12 నిమిషాలు) ఉన్నాయి.
ఈ లెక్కలు చూస్తుంటే సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో అర్థమవుతోంది.



