Back to FeedQuickToday Shorts

National
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
స్టాక్ మార్కెట్ ఎంట్రీ తప్పనిసరి: టాటా సన్స్ అభ్యర్థనను తిరస్కరించిన ఆర్బీఐ
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ నుంచి మినహాయింపు పొందాలని చూస్తున్న టాటా సన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. తమ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ టాటా సన్స్ చేసిన రిక్వెస్ట్‌ను ఆర్బీఐ తిరస్కరించింది.ఆర్బీఐ నిబంధనల ప్రకారం 'అప్పర్ NBFC'గా గుర్తింపు పొందిన సంస్థలు మూడేళ్లలో తప్పనిసరిగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. 2022లో టాటా సన్స్‌కు ఈ హోదా లభించింది. అయితే, కంపెనీ తమ అప్పులన్నీ క్లియర్ చేసుకుని 2024లో NBFC లైసెన్స్ రద్దుకు దరఖాస్తు చేయగా, ఆర్బీఐ దాన్ని రిజెక్ట్ చేసింది. దీనితో టాటా సన్స్ త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Tags:#National





