Back to FeedQuickToday Shorts

National
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నేడు హిందీ దివస్: ఈ ప్రత్యేక రోజు ప్రాముఖ్యత మరియు నేపథ్యమిదే!
1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగ సభ దేవానాగరి లిపిలోని హిందీని దేశ అధికారిక భాషగా ఆమోదించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం ఈ గుర్తింపు దక్కింది.
ఈ భాష ప్రాధాన్యతను మరియు గొప్పతనాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న 'హిందీ దినోత్సవం' నిర్వహిస్తున్నారు.తొలిసారిగా 1953 సెప్టెంబరు 14 నుండి ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషను మరింతగా ప్రోత్సహించేందుకు మరియు ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రతి ఏటా జనవరి 10వ తేదీన 'విశ్వ హిందీ దివస్'ను జరుపుకుంటారు.
Tags:#National#National#Shorts





