Back to FeedQuickToday Shorts

National
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏజెంట్లకు షాక్.. లైఫ్ ఇన్సూరెన్స్ కమిషన్ల కోతకు ఐఆర్డీఏఐ ప్రతిపాదన!
బీమా రంగంలో పెరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, మిస్ సెల్లింగ్‌కు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఏజెంట్ల కమిషన్లను తగ్గించాలని ఐఆర్డీఏఐ (IRDAI) ప్రతిపాదించింది.
పాలసీదారులు ప్రీమియం చెల్లించే వ్యవధి ఆధారంగా ఈ కమీషన్లలో కోత ఉంటుంది.
ఉదాహరణకు 10 ఏళ్లు పైబడిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు తొలి ఏడాది ఇచ్చే 30% పైబడిన కమిషన్‌ను 20-25 శాతానికి తగ్గించింది.ఐఆర్డీఏఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో కస్టమర్లపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.
అయితే, ఏజెంట్ల కమీషన్లకు ఇలా కోత విధించడం వల్ల భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ నెట్వర్క్ విస్తరణ కష్టతరంగా మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:#National#National#Shorts





