Back to FeedQuickToday Shorts

National
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వంటగ్యాస్ కొరత వార్తలు అవాస్తవం: స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ (LPG) సిలిండర్లకు కొరత ఏర్పడుతుందనే ఊహాగానాలను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ తీవ్రంగా ఖండించారు.
గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తుందనే వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.
ప్రధాని మోదీ తీసుకున్న ముందస్తు చర్యల వల్లే ఇలాంటి ఇబ్బందులను అధిగమించగలిగామని తెలిపారు.
దేశీయ గ్యాస్ ఉత్పత్తిని గతంలో ఉన్న 34 వేల టన్నుల నుంచి ప్రస్తుతం 56 వేల టన్నులకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
అంతేకాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న 1.07 లక్షల పెట్రోల్ పంపుల్లోనూ ఎలాంటి ఇంధన కొరత లేదని ఆయన భరోసా ఇచ్చారు.



