Back to FeedQuickToday Shorts

National
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
భారంగా మారనున్న నిర్మాణ వ్యయం.. త్వరలో పెరగనున్న సిమెంట్ ధరలు!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల థర్మల్ కోక్, పెట్కోక్ దిగుమతుల వ్యయం సుమారు 20 శాతం మేర పెరిగింది.
దీని ప్రభావం విద్యుత్, ఇంధన ధరలపై పడుతుండటంతో దేశీయ సిమెంట్ కంపెనీలకు ఉత్పత్తి భారం అధికమవుతోందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.ఈ నేపథ్యంలో రానున్న రెండు, మూడు నెలల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
టన్ను సిమెంట్ కు రూ.150 నుంచి రూ.200 వరకు, అలాగే బస్తాకు రూ.10 నుంచి రూ.15 వరకు ధరలు పెరగొచ్చని పేర్కొంది.
ఈ పరిణామాలతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది.
Tags:#National#National#Shorts





