Back to FeedQuickToday Shorts

National
Sep 7, 2026Short Read
బిగ్‌బాస్ హోస్ట్‌ల రెమ్యునరేషన్: అత్యధిక పారితోషికం ఎవరికంటే?
దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో హోస్ట్‌ల రెమ్యునరేషన్ వివరాలు ఆసక్తికరంగా మారాయి. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, పారితోషికం విషయంలో హిందీ బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ అందరికంటే ముందున్నారు. ఆయన అత్యధికంగా ₹125 కోట్లు (ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు ₹15 కోట్లకు పైగా) తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇతర భాషల హోస్ట్‌ల రెమ్యునరేషన్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి:
విజయ్ సేతుపతి (తమిళం):- ₹75-80 కోట్లు
నాగార్జున (తెలుగు):- ₹35-40 కోట్లు
మోహన్ లాల్ (మలయాళం):- ₹30 కోట్లు
కిచ్చా సుదీప్ (కన్నడ):- ₹20 కోట్లు
ఇక బెంగాలీ వెర్షన్ బిగ్‌బాస్ కోసం మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ 4 ఏళ్ల కాలానికి ఏకంగా ₹125 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.





