
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు మూడో రోజుకు చేరాయి.
జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతోనూ వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు.
మరోవైపు ముంబైలో రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు.
మహారాష్ట్రలో ఎస్ఐఆర్ను నిలిపివేయాలని రాజ్ ఠాక్రే, భవిష్యత్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, జ్ఞానేశ్ కుమార్ కేరళ పీడబ్ల్యూడీ కార్యదర్శిగా పనిచేసిన కాలానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై కేరళ ప్రభుత్వం ప్రాథమిక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
కేపీసీసీ నేత ఫిర్యాదు మేరకు వీఏసీబీ దర్యాప్తు చేపట్టనుంది.



