Back to FeedQuickToday Shorts

National
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సీఈసీని పదవి నుంచి ఎలా తొలగించవచ్చంటే?
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను (CEC) నేరుగా తొలగించే అధికారం ఎవరికీ ఉండదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది.
దీని కోసం ముందుగా లోక్‌సభలో కనీసం 100 మంది, లేదా రాజ్యసభలో 50 మంది ఎంపీలు సంతకాలు చేసి స్పీకర్ లేదా ఛైర్మన్‌కు సమర్పించాలి.
ఒకవేళ స్పీకర్ దీనిని ఆమోదిస్తే...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI), ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్, మరియు న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతుంది.
ఆ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే, పార్లమెంటు ఉభయ సభలలో మెజార్టీ ఓటింగ్ ద్వారా సీఈసీని పదవి నుంచి తొలగిస్తారు.
Tags:#National#National#Shorts





