Back to FeedQuickToday Shorts

National
Jul 31, 2026Short Read
బోల్డ్ సీన్స్ పాత్ర పై స్పందించిన "టాక్సిక్" హీరోయిన్
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, యశ్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్' చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆ పాత్ర యొక్క నెరేషన్ విన్నప్పుడు తాను చాలా ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు.
ఒక నటిగా తాను కలలుగనే పాత్ర దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు.సినిమాల్లో మహిళలను మూసధోరణి పాత్రల్లో చూపిస్తే తనకు నచ్చదని, మహిళలు అంతకుమించి చాలా చేయగలరని ఆమె అభిప్రాయపడ్డారు.
మహిళల పాత్రలు బలంగా, రియలస్టిక్గా ఉండాలని ఆమె కోరుకుంటున్నారు.
కాగా, ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ హద్దులు దాటాయని, ఇలాంటి పాత్రలకు కియారా ఎలా అంగీకరించిందని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి.





