Back to FeedQuickToday Shorts

National
Aug 22, 2026Short Read
TVK గెలుపుపై పందెం.. మీసం తీసేసిన ఏఐఏడీఎంకే నేత!
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
టీవీకే పార్టీ ఎన్నికల్లో పది సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే తన మీసం తీసేస్తానని గతంలో నీలగిరి జిల్లా ఏఐఏడీఎంకే సెక్రటరీ, న్యాయవాది బాలానంద కుమార్ సవాల్ విసిరారు.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే ఏకంగా 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి అధికారంలోకి వచ్చింది.దీంతో తానిచ్చిన మాట ప్రకారం బాలానంద కుమార్ తన మీసాలు తీసేశారు.
ఈ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఎప్పుడూ నిండు మీసాలతో గంభీరంగా కనిపించే ఆయన, మీసం లేకుండా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన కొత్తగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేతగా ఆయన వార్తల్లో నిలిచారు.





