Back to FeedQuickToday Shorts

Telangana
Aug 31, 2026Short Read
తెలంగాణ వాతావరణ అప్డేట్: రానున్న మూడు రోజులు వానలే వానలు!
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు ముసురు వాతావరణం నెలకొంటుందని అధికారులు తెలిపారు.ఈ క్రమంలో, ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ మరియు మేడ్చల్ మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.





