
19,892 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం: భట్టి విక్రమార్క
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధికంగా 19,892 మెగావాట్లకు చేరిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్ నమోదైనప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూశామని చెప్పారు.
ప్రజాభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
కర్ణాటకలో గరిష్ఠ డిమాండ్ 15 వేల మెగావాట్లలోపే, ఆంధ్రప్రదేశ్లో సుమారు 13 వేల మెగావాట్లుగా ఉందని తెలిపారు.
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు.
రికార్డు డిమాండ్ సమయంలోనూ నిరంతర సరఫరా అందించిన విద్యుత్ సంస్థల అధికారులు, సిబ్బందిని అభినందించారు.
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే లేదా ప్రభుత్వ రంగం నుంచి తప్పించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేస్తూ విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.



