Back to FeedQuickToday Shorts

Telangana
Aug 31, 2026Short Read
నిజామాబాద్ సభలో భావోద్వేగం.. జైలు జీవితాన్ని గుర్తుచేసుకుని కవిత కన్నీళ్లు!
తన అరెస్టు, జైలు జీవితంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
నిజామాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ..
"ఏ తప్పు చేయని మీ ఆడబిడ్డనైన నన్ను తీహార్ జైలులో పెట్టారు.
సీబీఐ, ఈడీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా నేను వెనక్కి తగ్గలేదు" అని చెప్పారు.చివరికి తానెలాంటి తప్పు చేయలేదని కోర్టు కూడా తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు.
అయితే, పార్టీ నుంచి నన్ను అన్యాయంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుండెల్లో బాధతో ఏడుస్తున్నానని, నన్ను పిరికిదాన్ని అనుకోవద్దని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.





