Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వైఎస్సార్సీపీ క్యాడర్‌కు దిశానిర్దేశం: 'జగన్ 2.0'లో కార్యకర్తలే కీలకం : వైఎస్ జగన్
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ముఖ్యంగా పోలీసుల తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అన్యాయంగా వ్యవహరించే పోలీసు అధికారులను గుర్తించి, వారి పేర్లను తక్షణమే డిజిటల్ డైరీలో నమోదు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రాగానే, అక్రమాలకు పాల్పడిన ప్రతి అధికారి లెక్క తేలుస్తామని, చట్టం తన పని తాను చేసేలా చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
భవిష్యత్తులో రాబోయే 'జగన్ 2.0' ప్రభుత్వంలో కార్యకర్తలదే అగ్రస్థానం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.



