Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 8, 2026Short Read
టెన్త్ అర్హతతో ఏపీలో 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ అర్హతతో మొత్తం 913 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నారు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి: అనకాపల్లిలో అత్యధికంగా 77 పోస్టులు ఉండగా, కర్నూలులో 65 ఉన్నాయి.
తూర్పుగోదావరి 44, అల్లూరి, మన్యం 43 చొప్పున, పశ్చిమగోదావరి 42, అన్నమయ్య 41, ప్రకాశం, కడప జిల్లాల్లో 38 చొప్పున, కృష్ణా 37, వైజాగ్ 33, చిత్తూరు, కోనసీమల్లో 32 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.అదేవిధంగా పల్నాడు, విజయనగరంలో 31, కాకినాడ, నెల్లూరు 29, ఏలూరు 27, అనంతపురం 26, మార్కాపురం 25, సత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లో 22 పోస్టులున్నాయి.
గుంటూరు, నంద్యాల, పోలవరం, తిరుపతిలో 21 చొప్పున, ఎన్టీఆర్ 15, బాపట్లలో 7 పోస్టుల చొప్పున అభ్యర్థుల ఎంపిక జరగనుంది.



