
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన కందుల జెస్సీ
అమరావతి, జూలై 27 (క్విక్ టుడే న్యూస్):
ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ కార్యక్రమమైన ‘మిషన్ శక్తిశాట్’ కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని కందుల జెస్సీ ఎంపికై అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం మంత్రి నారా లోకేశ్‌ను కలిసి ఆశీర్వాదాలు పొందారు. జెస్సీని అభినందించిన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఏపీలో స్పేస్ సిటీ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని, అంతరిక్ష రంగంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం మిషన్ శక్తిశాట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జెస్సీ మాట్లాడుతూ, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో చేసిన ప్రయోగాల వల్లే అంతరిక్షంపై ఆసక్తి పెరిగిందని, భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్‌గా ఎదగడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమానికి 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది బాలికలు దరఖాస్తు చేయగా, 20 మందిలో జెస్సీ చోటు దక్కించుకున్నారు.





