Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బంగాళాఖాతంలో అల్పపీడనం: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడవచ్చని IMD పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


