Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
లద్దాఖ్‌లో 'అమరావతి' ప్రస్తావన.. ఆనందం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్
దేశ సరిహద్దులైన లద్దాఖ్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి' పేరు వినిపించడం పట్ల మంత్రి నారా లోకేశ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.
ఓ ట్రావెలర్ లద్దాఖ్‌లో పర్యటిస్తూ..
స్థానిక పిల్లలకు తాను ఏపీ నుంచి వచ్చానని చెప్పగా, వెంటనే ఆ చిన్నారులు 'అమరావతినా?' అని అడిగారు.
దీనికి ఆ ట్రావెలర్ అవునని బదులిచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మంత్రి లోకేశ్ తన 'X' ఖాతాలో షేర్ చేశారు.
"దేశ సరిహద్దుల్లో మన రాజధాని పేరు వినడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు.
ఇది చిన్న ప్రపంచం, గొప్ప అనుబంధాలు" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



