Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 2, 2026Short Read
పవన్ కళ్యాణ్ వర్క్ సూపర్ : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
'పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పవన్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఆయన పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ప్రశంసించారు.
రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలనిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.





