Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 9, 2026Short Read
వైసీపీకి భారీ షాక్.. టీడీపీ గూటికి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, ప్రస్తుత విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేశారు.
విజయనగరం జిల్లా అధ్యక్ష పదవితో పాటు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, తన రాజీనామా లేఖను వైఎస్ జగన్కు పంపారు.
వైసీపీని వీడిన వెంటనే చిన్న శ్రీను..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.
తాజా పరిణామంతో ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.



