Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
దాదాపు నెల రోజుల విరామం తర్వాత విజయవాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక
దాదాపు నెల రోజుల విరామం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
కాగా, కుడి భుజానికి సర్జరీ జరిగిన అనంతరం వైద్యుల సూచన మేరకు ఆయన గత ఆగస్టు 23న కేరళకు వెళ్లారు.
అక్కడ త్రిసూర్ సమీపంలోని ఒక ఆయుర్వేద కేంద్రంలో సుమారు 21 రోజుల పాటు ఆయన చికిత్స తీసుకున్నారు.
ఈ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఆయన తిరిగి విజయవాడకు చేరుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.



