Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 10, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ విమర్శలు: కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!
మెగా డీఎస్సీ భర్తీ ప్రక్రియలో జరిగిన అక్రమాలను ఆధారాలతో బయటపెడుతుంటే సీఎం చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
స్పోర్ట్స్ కోటా కింద నకిలీ సర్టిఫికెట్లతో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు.పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్ అనే అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు.
అసలు పరీక్షలే లేకుండా 372 మందికి ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారని, స్పోర్ట్స్ కోటా జీవోను మార్చేసి పోస్టులను భర్తీ చేయడంలో ఉన్న అంతర్యం ఏమిటని జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





