Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వర్షాకాలంలోనూ మండిపోతున్న ఎండలు.. ఏపీలో అప్రకటిత కరెంట్ కోతలు!
ఎల్‌నినో ప్రభావంతో ఏపీలో వాతావరణం వేసవిని తలపిస్తోంది.
తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలకు చేరుకున్నాయి.
473 ప్రాంతాల్లో 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి.
ఈ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు జనం ఏసీలు, కూలర్లను విపరీతంగా వినియోగిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరుకుంది.
అయితే పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండటం ప్రజలను మరింత ఇబ్బందికి గురిచేస్తోంది.



