Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అక్టోబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ..
ఎన్నికలు జరగవనే ఎలాంటి అపోహలు ఎవరికీ వద్దని తేల్చిచెప్పారు.
ఎన్నికలను వాయిదా వేయించాలని వైసీపీ పన్నుతున్న కుయుక్తులు ఏమాత్రం పనిచేయవని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరలోనే పరిష్కారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక కూటమి పార్టీల పొత్తులకు సంబంధించిన అంశాలను సమన్వయ కమిటీ, అధిష్టానం నిర్ణయిస్తుందని లోకేష్ వివరించారు.



