Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
కొత్త చట్టం దిశగా ఏపీ సర్కార్: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడే వారి నుంచి నష్టపరిహారం వసూలు చేసేలా కఠిన చట్టం తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీకి సూచించారు.
కూటమి నేతలు ఐక్యంగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఈ బాధ్యత ఇన్చార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీ ముసుగులో వైఎస్సార్సీపీ నేతలు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పార్టీ కేంద్ర కార్యాలయం, SAAP ఆఫీసుపై దాడులకు పాల్పడింది ఒకరేనని, జగన్ రౌడీ షీటర్లను ఉసిగొల్పి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





