Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీలో వాయుగుండం ఎఫెక్ట్: రేపు కూడా స్కూళ్లకు సెలవు కావాలంటున్న పేరెంట్స్
ఉత్తరాంధ్రలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





