Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Jul 31, 2026Short Read
వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం: ఆనంద్ రెడ్డి కన్నుమూత
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆయనకు స్వయానా పెదనాన్న, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడైన ఆనంద్ రెడ్డి కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనంద్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
ఈ వార్తతో వైఎస్ కుటుంబ సభ్యులు, వైసీపి శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.రేపు జరగనున్న ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లనున్నారని వైసీపీ నాయకులు తెలిపారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


