Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
దాడులపై గవర్నర్‌ను కలవనున్న వైయస్ జగన్!
ఏపీ వైయస్సార్సీపీ అధినేత జగన్ రేపు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు.
రాష్ట్రంలో శాంతియుత నిరసనలు చేస్తున్న వైయస్సార్సీపీ నాయకులపై జరుగుతున్న దాడిపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
అలాగే DSC అక్రమాలపై సమగ్రంగా సీబీఐ విచారణ చేయించాలని గవర్నర్‌ను కోరనున్నారు.
ఈ మేరకు ఇవాళ పార్టీ నాయకులతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
DSC స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్ అడ్డంగా దొరికారని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Tags:#Andhra Pradesh#National#Shorts




