
విజయసాయిరెడ్డి ఆరోపణలను ఖండించిన సజ్జల
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మత మార్పిడులను ప్రోత్సహించారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదని ఆయన అన్నారు.దాదాపు 40 ఏళ్లుగా వైఎస్సార్ మరియు జగన్ కుటుంబాల వెంటే విజయసాయిరెడ్డి ఉన్నారని సజ్జల గుర్తుచేశారు.
ఒకవేళ జగన్ నిజంగా మత మార్పిడులను ప్రోత్సహించే వారైతే, ముందుగా తన వెంటే ఉన్న విజయసాయిరెడ్డి మతాన్నే మార్చేవారు కదా అని ఆయన ఎద్దేవా చేశారు.
ఊర్లలో ఉన్న వాళ్లందరి మతాలను ఎందుకు మారుస్తారని ప్రశ్నించారు.అన్ని మతాల పట్ల జగన్కు సమానమైన గౌరవం ఉందని, ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సజ్జల స్పష్టం చేశారు.
కేవలం రాజకీయ ప్రచారం కోసమే విజయసాయిరెడ్డి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.





