
దానం నాగేందర్ విషయంలో హైకోర్టు తీర్పు బీఆర్ఎస్కు చెంపపెట్టు: మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
దానం నాగేందర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్కు గట్టి చెంపపెట్టు అని, కాంగ్రెస్కు శ్రీరామరక్ష అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ఏ క్షణంలోనైనా ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎవరు పోటీ చేయాలనే దానిపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కేసీఆర్పై తీవ్రస్థితిలో మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని పూర్తిగా తెచ్చిందే కేసీఆర్ అని ఆరోపించారు.
గందరగోళ పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని, సబితను పార్టీలోకి లాగి మంత్రి పదవి కట్టబెట్టారని గుర్తుచేశారు.
కేవలం కాంగ్రెస్ పైనే కాకుండా, బీజేపీ కూడా ఇతర ప్రాంతాల్లో TMC, శివసేన, NCP పార్టీలను చీల్చిందని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.





