Back to FeedQuickToday Shorts

District
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పెద్ద చెరువులో చీకట్లే..!సెల్ఫోన్ లైట్లతో గణేష్ నిమజ్జనం
అధికారులు పరిశీలించారు.. ఏర్పాట్లు మాత్రం ఎక్కడ?
తొర్రూరు సెప్టెంబర్ 19(క్విక్ టుడే న్యూస్)
పట్టణంలోని పెద్ద చెరువులో గణేష్ నిమజ్జనం కొనసాగుతున్న వేళ సరైన విద్యుత్ లైటింగ్ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.గణేష్ నిమజ్జనం ప్రారంభమైన మూడో రోజు నుంచీ ఇప్పటివరకు తగిన లైటింగ్ ఏర్పాటు చేయలేదని భక్తులు, నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో రాత్రివేళ సెల్ఫోన్ లైట్లను ఆశ్రయిస్తూ నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగానే ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపాలిటీ అధికారులు.. కనీసం లైటింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
Tags:#District#National





