Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వినాయక చవితి వేళ తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న భారీ వర్షాలు
వినాయక చవితి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు.
ఇరు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వానలు పడుతున్నాయి.
అటు తెలంగాణలోని వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం.
ఈ భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-హనుమకొండ జాతీయ రహదారి (NH-163) పైకి భారీగా నీరు చేరింది, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





