Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
గణేశ్ నిమజ్జనానికి డీజేల అనుమతిపై మంత్రి లోకేశ్ కీలక విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాల వేళ డీజే వాహనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు.
డీజేలకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తున్నారని, దీనిపై తనకు అనేక ఫిర్యాదులు, మెసేజ్‌లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో గణేశ్ భక్తులకు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీజేలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి అనితను, డీజీపీని లోకేశ్ కోరారు.
పండుగ వాతావరణంలో ఏ ఒక్క డీజే వెహికల్‌ను కూడా సీజ్ చేయకుండా, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





