Back to FeedQuickToday Shorts

Telangana
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలంగాణకు ఎల్లో అలర్ట్: పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు!
తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్ష సూచన మొదలైంది.మరోవైపు ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరిగి, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags:#Telangana#National





