Back to FeedQuickToday Shorts

District
Aug 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఎరువుల దుకాణాల తనిఖీ..పారాక్వాట్ విక్రయిస్తే కఠిన చర్యలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ అధికారి (ఏఓ)రామ్ నర్సయ్య,ఎస్సై మహేందర్ రెడ్డి శుక్రవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుకాణాల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, పురుగుమందుల నిల్వలను పరిశీలించారు.నిషేధిత లేదా నిబంధనలకు విరుద్ధంగా పారాక్వాట్ గడ్డి మందులను విక్రయిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు నాణ్యమైన,అనుమతించబడిన ఎరువులు, పురుగుమందులనే విక్రయించాలని సూచించారు.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.



