
ఛత్తీస్గఢ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు.మర్యాదపూర్వకంగా కలిసిన పార్టీ నాయకులు
జనగామ, అక్టోబర్ 05 (క్విక్ టుడే న్యూస్):
ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు సోమవారం జనగామ జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఆయన అత్తగారు జనగామ వాస్తవ్యులు కావడంతో వారి 11వ రోజు కార్యక్రమానికి హాజరుకావడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జనగామ జిల్లా ఎన్నికల అధికార ప్రతినిధి పెద్దోజు జగదీష్, ఛత్తీస్గఢ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జు వెంకట్రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో జనగామ జిల్లాలో పార్టీ ప్రస్తుత స్థితిగతులు, రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం గుజ్జు వెంకట్రావు మాట్లాడుతూ. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దూసర శివకృష్ణ, శ్రీనివాస్, గజ్జి మధు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





