Back to FeedQuickToday Shorts

District
Jul 22, 2026Short Read
ఘనంగా చెరుకూరి మౌనిక యాదవ్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా మాజీ అధ్యక్షురాలికి శుభాకాంక్షల వెల్లువ
జనగామ, జులై 22 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా మాజీ అధ్యక్షురాలు చెరుకూరి మౌనిక యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బోడ రమేష్ నేత, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, సీనియర్ నాయకులు శడ నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ ముక్క విష్ణు, పట్టణ కార్యదర్శి వల్లల.బానూచందర్ సీనియర్ నాయకులు మంద దిలీప్ తదితరులు హాజరై మౌనిక యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బహుజన సమాజ హక్కుల సాధన కోసం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతానికి చెరుకూరి మౌనిక యాదవ్ చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.





