Back to FeedQuickToday Shorts

General
Aug 31, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
2027 ఐపీఎల్ లో ధోనీ ఆడుతాడా? సీఎస్కే సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు!
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ 2027 ఐపీఎల్ సీజన్లో ఆడుతాడా లేదా అనేది తల ఫ్యాన్స్ కు ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ విషయం పై సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ తాజాగా స్పందించారు.
"నేను ఆడబోనని ధోనీ ఇప్పటివరకు చెప్పలేదు.
కాబట్టి మనం వెయిట్ చేద్దాం" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఈ మాటలు విన్న తర్వాత ధోనీ ఫ్యాన్స్ కు ఆయన మళ్ళీ గ్రౌండ్ లోకి వస్తాడనే ఆశలు చిగురిస్తున్నాయి.
అయితే, ఫ్రాంచైజీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కొంతమంది అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరి ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.



