
రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
మణుగూరు మండలం రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన పొట్టురి బాలకృష్ణకు రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీ ను పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి,ఎల్ఓసీ ల ద్వారా అర్హులైన వారికి అవసర మైన సహాయం అందేలా తన వంతు కృషి కొనసాగిస్తానని అన్నారు.
ప్రజలకు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే, ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత మేరకు సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





