
నేడు సాగర్‌లో సీఎం వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : ఆగస్టు రెండో వారం ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్‌లో ప్రత్యేకంగా వరుణయాగం నిర్వహించనుంది.
నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ యాగం ప్రారంభం కానుంది.
మొత్తం 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రార్థిస్తూ యాగంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి ఎ.
రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ పర్యటనకు వెళ్లనున్నారు.
ముందుగా మధ్యాహ్నం 2.45 గంటలకు హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి విజయవిహార్ గెస్ట్‌హౌస్ ప్రాంగణానికి వెళ్తారు.
అక్కడ జరుగుతున్న వరుణయాగంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.





