Back to FeedQuickToday Shorts

General
Aug 2, 2026Short Read
తిరుమల శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్య-మహీకా శర్మ!
క్విక్ టుడే న్యూస్, స్పోర్ట్స్ :- భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య తన ప్రియురాలు మహీకా శర్మతో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం, రంగనాయక మండపంలో వేద పండితులు హార్దిక్, మహీకాలకు ఆశీర్వచనం అందజేశారు.
అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
ప్రస్తుతం వీరు శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రస్తుతం వీరిద్దరు ఎక్కడ తిరిగినా కూడా క్షణాల్లోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.





