Back to FeedQuickToday Shorts

General
Aug 31, 2026Short Read
గాయం నుండి కోలుకున్న రష్మిక.. త్వరలో మళ్లీ సెట్స్‌పైకి!
సినిమా షూటింగ్ సమయంలో గాయపడి గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా, మళ్లీ తన పనిలో నిమగ్నం కానున్నారు.
జూలై నెలాఖరులో గాయపడిన ఆమె, ఇప్పుడు కోలుకుని త్వరలోనే తాను తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇన్నాళ్లు విశ్రాంతి సమయంలో తన ఇంట్లో గడిపిన అందమైన క్షణాలను తాను ఎంతో మిస్ అవుతానని పేర్కొంటూ, కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ బ్యూటీ 'మైసా' చిత్రంతో పాటు, విజయ్ నటిస్తున్న 'రణబాలి', అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న 'రాకా' తదితర క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.
దీంతో త్వరలోనే ఆమె మళ్లీ వరుస షూటింగ్స్‌తో ఫుల్ బిజీ కానున్నారు.
ఈ అప్డేట్తో రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





