
బోనాల ఉత్సవాల్లో హస్తకళా వస్తు ప్రదర్శన
హైదరాబాద్, జూలై15(క్విక్ టుడే న్యూస్):
ఆషాఢమాస బోనాల మహోత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి హస్తకళా వస్తు ప్రదర్శన–అమ్మకాల మేళా గురువారం నుంచి హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ బాల మాయాదేవి వెల్లడించారు. బోనాల పండుగకు అవసరమైన వివిధ రకాల చేతివృత్తుల ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి.హెచ్. హనుమంతరావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 30 స్టాల్స్‌తో నిర్వహించిన ఈ మేళాను, ఈసారి మరింత విస్తృతంగా 60 స్టాల్స్‌తో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.




